HomeTelangana

ఘోర బస్సు ప్రమాదం… 25 మంది సజీవ దహనం

ఘోర బస్సు ప్రమాదం… 25 మంది సజీవ దహనం

ఈ తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు సహా కనీసం 25 మంది మరణించారు. మరో ఎనిమిది మ

అత్యాచారాలు డ్రెస్‌ల వల్ల కాదు మగవాళ్ల క్రూరత్వం వల్ల జరుగుతాయి -శివాజీకి నాగబాబు కౌంటర్
రెండవ విడత కూడా కాంగ్రెస్ జోరు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విడుదల

ఈ తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు సహా కనీసం 25 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

యావత్మాల్ నుంచి పూణె వెళ్తున్న బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వేపై తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. టైరు పగిలిపోవడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టిందని చెప్పారు.

మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో 25 మంది సజీవదహనమయ్యారు. బస్సు డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. “దేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో ఉన్నాము” అని కడసానే అన్నారు.