HomeTelanganaPolitics

రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖలకు కొత్త అధ్యక్షుల నియామకం

రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖలకు కొత్త అధ్యక్షుల నియామకం

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మంగళవారం  తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడిగా

‘ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది’
కోదాడ పెద్ద చెరువు ఆక్రమణదారులకు నోటీసులు
చివరి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మంగళవారం  తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. 
తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని నియమించగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మాజీ మంత్రి డి పురందేశ్వరిని ఆ రాష్ట్ర అధ్యక్షరాలుగా నియమించింది. అలాగే పంజాబ్‌లో సునీల్ జాఖర్‌ను, జార్ఖండ్‌లో బాబులాల్ మరాండీని కూడా బిజెపి పార్టీ అధ్యక్షులుగా నియమించింది.

గత నెల రోజులుగా బండి సంజయ్‌ పనితీరుపై పలువురు సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, తెలంగాణ యూనిట్‌లో అంతర్గత పోరు బహిరంగంగానే సాగడం, సోషల్‌మీడియాలో నేతలు పరస్పరం స్లెడ్జింగ్‌ చేసుకోవడంతో పాటు పార్టీ అధిష్టానం తీరుపై విమర్షలు కూడా చేశారు.  గత వారం రోజులుగా కొత్త చీఫ్‌గా కిషన్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. సంజయ్‌ను భర్తీ చేసే ఆలోచన లేదని పార్టీ నాయకత్వం గతంలో తిరస్కరించినప్పటికీ, మంగళవారం కొత్త చీఫ్‌గా కిషన్ రెడ్డి పేరును ప్రకటించింది.

ఇటీవల ఢిల్లీలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌లతో చర్చించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్టీలో కొంత స్థిరత్వం తీసుకొచ్చేందుకు సంజయ్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నాయకుల మధ్య అంతర్గత విభేదాలు రాష్ట్రంలో పార్టీ అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయని, అందువల్ల పార్టీ విభజనతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోలేని తక్షణమే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

త్వరలో సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం . తనకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఈటల రాజేందర్ చాలా కాలంగా పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని నడ్డా, అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లారు. 

ఆంధ్రప్రదేశ్ లో కొద్ది సేపటి క్రితం వరకు అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు. పదవీ కాలం అయిపోయి నాలుగు నెలలు గడిచిపోయింది. మరో వైపు ఆయన టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఆ పార్టీకి దగ్గరవుతున్న నేపథ్యంలో సోము వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగించడం సరైంది కాదన్బి భావించిన అగ్రనాయకత్వం ఆయనను పక్కన పెట్టి పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించినట్టు సమాచారం.