అవకాశం కల్పించాలంటూ గొడవకు దిగిన స్థానికులు… గోదావరిఖని, డిసెంబర్ 14 (నినాదం): పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలింగ్ కేంద్ర వద్ద న
అవకాశం కల్పించాలంటూ గొడవకు దిగిన స్థానికులు…
గోదావరిఖని, డిసెంబర్ 14 (నినాదం): పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలింగ్ కేంద్ర వద్ద నిమిషం ఆలస్యం కావడంతో ఎన్నికల అధికారులు ఓటర్లను తిరస్కరించారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్ సిసి క్యాంపు నుండి వచ్చిన విద్యార్థి నిమిషం ఆలస్యం కావడంతో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయింది.
తనకు అవకాశం కల్పించాలని ఎన్నికల అధికారిని కోరినప్పటికీ సమయం అయిపోయిందంటూ తిరస్కరించారు.అక్కడే ఉన్న స్థానికులు దూరం నుంచి వచ్చిన యువతకి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారుల కోరిన ససేమిరా అనడంతో గొడవకు దిగారు. స్థానికులకు పోలీసులకు తోపులాటకు దారి తీసింది .


