HomeEditor's ChoiceGeneral

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు – ఎస్పీ నర్సింహన్

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు – ఎస్పీ నర్సింహన్

కోదాడ/నినాదం:సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలోరెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని సూర్యాపేట జిల్లాఎస్పీ నరసింహన్ అన్నారు.

చివరి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి
అనంతగిరి మండలంలో.. ఉప సర్పంచులు వీరే…
రెండవ విడత కూడా కాంగ్రెస్ జోరు

కోదాడ/నినాదం:
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో
రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని సూర్యాపేట జిల్లాఎస్పీ నరసింహన్ అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న ఎనిమిది మండలాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యాత్మకమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించామని, అలాగే అక్కడ సమస్యలను సృష్టించే వారిని కూడా ముందుగానే గుర్తించి వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలకు బైండవర్ చేయించినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది మరియు 1500 మంది పోలీస్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహన్ వివరాలను వెల్లడించారు.