HomeEditor's ChoiceGeneral

హటాత్తుగా మాయమైన సర్పంచ్ అభ్యర్థి భర్త – ఏం జరిగిందో తెలిసి షాకైన జనం

హటాత్తుగా మాయమైన సర్పంచ్ అభ్యర్థి భర్త –  ఏం జరిగిందో తెలిసి షాకైన జనం

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అనేక హైడ్రామాలు, విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెదక్ జిల్లాలో సర్పంచ్ భర్త హటాత్తుగా మాయమైపోవడం తో ఆ గ్రామంల

కుక్కల బెడద నివారణకు గ్రామ సర్పంచ్ చర్యలు
అనంతగిరి మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..
ఎస్సై ఉద్యోగాన్ని వదులుకున్నా పట్టం కట్టని ప్రజలు

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అనేక హైడ్రామాలు, విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెదక్ జిల్లాలో సర్పంచ్ భర్త హటాత్తుగా మాయమైపోవడం తో ఆ గ్రామంలో హై డ్రామా నెలకొంది.

మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త జనార్ధన్ రెడ్డి శనివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓటమి భయంతో ఆయన దాక్కున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మతలబు ఉందని ప్రత్యర్థి అభ్యర్థులు అనుమానించారు.ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డ్రోన్లు, జాగిల్ బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు జనార్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకుని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ విచారణ చేపట్టారు .సానుభూతి ఓట్ల కోసం భార్యాభర్తలు డ్రామా ఆడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భర్తను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్య చేశారని సబిత గ్రామంలో ప్రచారం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర అభ్యర్థులు డిమాండ్ చేశారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది.