•మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు •జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోదాడ/నినాదం:కౌంటింగ్ కు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటి
•మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు
•జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ/నినాదం:
కౌంటింగ్ కు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి మండలం బొజ్జ గూడెం తండా, లక్కవరం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో
పోలింగ్ సరళిని, కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.మధ్యాహ్నం 1:00 గంటలలోపు పోలింగ్ కేంద్ర ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, కౌంటింగ్ కు ఇబ్బంది లేకుండా రెండు టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి చేయించాలని అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి ఎటువంటి సెల్ ఫోన్స్ అనుమతించకూడదని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ సూచించారు.బొజ్జ గూడెం తండా గ్రామపంచాయతీలోని 8 వార్డు లలో 1215 ఓట్లు ఉన్నాయని మధ్యాహ్నం 12:30 గంటల వరకు 91 శాతం, లక్కవరం గ్రామపంచాయతీలోని 8 వార్డు లలో 972 ఓట్లు ఉన్నాయని మధ్యాహ్నం 12:40 గంటల వరకు 92.00 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఆర్ ఓ లు నరసింహారెడ్డి, తేజోరామ్ లు కలెక్టర్ కు వివరించారు.

