తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి నిరాకరించిన, తాను సమైక్యవాదినని ప్రకటించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని మరో ఆంధ్రా నేత , మాజీ ఉపరాష్ట్రపతి వెంక
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి నిరాకరించిన, తాను సమైక్యవాదినని ప్రకటించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని మరో ఆంధ్రా నేత , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో ఎస్పీ పాలు విగ్రహ ప్రతిష్ట అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యతిరేకి అయిన ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం పట్ల కొద్ది రోజులుగా తెలంగాణ వాదులు నిరసన తెలుపుతున్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహలు ఏర్పాటు చేయాలంటూ పట్టుబట్టారు.ఈ నేపథ్యంలో ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
విగ్రహ ఆవిష్కరణను వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులను ఈ రోజు తెల్లవారుజామునుంచే పోలీసులు హైజ్ అరెస్టు చేశారు. రవీంద్ర భారతి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. ఎప్పుడు ఏంజరుగుతుందో అనే అనుమానాల మధ్య, పోలీసుల పహారాలో ఎట్టకేలకు ఈ రోజు బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
నిజానికి ఈ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సి ఉంది. అయితే ఆయన ఢిల్లీలో ఉన్నందువల్ల వెంకయ్య నాయుడు విగ్రహావిష్కరణ చేశారు. అయితే వివాదాల నేపథ్యంలో కావాలనే రేవంత్ ఈ కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది.
వెంకయ్యనాయుడు విగ్రహాన్నీ ఆవిష్కరించగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు,మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభలేఖ సుధాకర్, ఎస్పీ శైలజతో పలువురు సినీ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

