HomeEditor's ChoiceGeneral

ఎస్సై ఉద్యోగాన్ని వదులుకున్నా పట్టం కట్టని ప్రజలు

ఎస్సై ఉద్యోగాన్ని వదులుకున్నా పట్టం కట్టని ప్రజలు

*10 ఓట్ల తేడాతో ఓటమిని చవి చూసిన మాజీ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు… *ఓడినా ప్రజాసేవలోనే ఉంటానంటున్న వెంకటేశ్వర్లు కోదాడ/నినాదం:ఎస్సై ఉద్యోగాన్ని వది

బొజ్జగూడెం తండా గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం
కుక్కల బెడద నివారణకు గ్రామ సర్పంచ్ చర్యలు
‘గ్రామాల అభివృద్దికి ఇలాంటి నాయకులే కావాలి’

*10 ఓట్ల తేడాతో ఓటమిని చవి చూసిన మాజీ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు…

*ఓడినా ప్రజాసేవలోనే ఉంటానంటున్న వెంకటేశ్వర్లు

కోదాడ/నినాదం:
ఎస్సై ఉద్యోగాన్ని వదిలేసుకుని ప్రజాసేవ కోసం సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన వెంకటేశ్వర్లును దురదృష్టం వెంటాడింది. సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కేవలం పది ఓట్ల స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ, ఇంకా పదవీకాలానికి ఐదు నెలలు మిగిలి ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకుని ఎన్నికల బరిలోకి దిగారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానికంగా మంచి స్పందన లభించినప్పటికీ, చివరికి ఫలితం అనుకూలంగా రాలేదు.మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి వెంకటేశ్వర్లుకు వ్యక్తిగతంగా మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఫలితం తేలడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐ ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంకటేశ్వర్లుకు ఇది తీవ్ర నిరాశగా మారింది. అయినప్పటికీ ప్రజల సేవ కొనసాగిస్తానని ఆయన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం.