ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో ఆలస్యం ఏర్పడింది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలకు వెళ్లాల్సిన ఆయన వి
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో ఆలస్యం ఏర్పడింది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలకు వెళ్లాల్సిన ఆయన విమానం సోమవారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం వల్ల టేకాఫ్ జాప్యమైంది. తర్వాత సుమారు 9:30 గంటల ప్రాంతంలో ప్రధాని బయలుదేరారు.
ఈ పొగమంచు ప్రభావం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ విమాన సేవలపైనా తీవ్రంగా పడింది. దృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా తగ్గడంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. కొన్ని రద్దయ్యాయి. విమానాశ్రయ అధికారులు ఈ మేరకు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు.ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక అడ్వైజరీలు విడుదల చేశాయి. కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించాయి. విమానాల స్టేటస్‌ను వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తనిఖీ చేసుకోవాలని సూచించాయి. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపిన ఈ సంస్థలు, ప్రయాణికుల భద్రతే ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశాయి.

