HomeEditor's ChoiceGeneral

అవును నాకు పొగరే…నన్ను చూసుకొని నాకు పొగరు -బాలకృష్ణ‌

అవును నాకు పొగరే…నన్ను చూసుకొని నాకు పొగరు -బాలకృష్ణ‌

''అవును నాకు పొగరు. నన్ను చూసుకునే నాకు పొగరు'' అని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.అఖండ భారత్ (అఖండ 2) చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా జరి

సంస్కారహీనుడు, మురికివాడు: శివాజీపై నిప్పులు చెరిగిన‌ రాంగోపాల్ వర్మ‌
నటుడు శివాజీ హీరోయిన్లపై పురుషాహంకార ‘XXX’ వ్యాఖ్యలు…. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్న మహిళలు
క్షమాపణ చెప్పిన శివాజీ… అందులో నిజాయితీ ఉందా ?

”అవును నాకు పొగరు. నన్ను చూసుకునే నాకు పొగరు” అని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.
అఖండ భారత్ (అఖండ 2) చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా జరిగిన విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ ప్రసంగం అభిమానులను ఉర్రూతలూగించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణ బాలకృష్ణ ప్రసంగమే. ఇందులో ఆయన సినిమా విజయం, తన వ్యక్తిత్వం, ధర్మం, సమాజం వంటి పలు అంశాలను స్పృశించారు.

అఖండ 2 సినిమాపై బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు “సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది” అని అంటున్నారని తెలిపారు.”ఇది మంత్రోచ్ఛారణ, వేదం, మన భారత దేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వాన్ని కలగలిపిన సినిమా.”ప్రతి డైలాగ్‌ ఒక ఆణిముత్యం లాంటిదని కొనియాడారు.
‘అఖండ’లో ప్రకృతి, పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో చూపించగా, ‘అఖండ 2’లో మనిషే దేవుడైతే ఎలా ఉంటాడో చూపించామని చిత్ర కథాంశాన్ని వివరించారు.

తనపై తరచుగా వచ్చే పొగరు విమర్శలకు బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.”ఎవరిని చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అంటారు? నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు ఉంది. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య” అని ఆయన అన్నారు.

సినిమా తన వృత్తి మాత్రమే కాదని, అది తనకు దైవంతో సమానమని, సినిమా తనకు నిత్యం ఉత్సాహాన్ని ఇస్తుందని బాలకృష్ణ పేర్కొన్నారు.”చరిత్రను సృష్టించినవాడు మళ్లీ మళ్లీ తిరగరాసి, తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అదొక తెలియని శక్తి.”‘అఖండ 2’ కేవలం తెలుగు సినిమా కాదని, దీన్ని ప్రపంచ సినిమాగా ఆయన అభివర్ణించారు.

చివరిగా, ఈ ఘన విజయం కోసం కృషి చేసిన చిత్ర బృందానికి మరియు ప్రేక్షక దేవుళ్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.