HomeEditor's ChoiceGeneral

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి కృష్ణా నదిలోకి వెళ్ళిన లారీ

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి కృష్ణా నదిలోకి వెళ్ళిన లారీ

గూగుల్ మ్యాప్స్‌ను అతిగా నమ్మడం వల్ల పెను ప్రమాదం తప్పిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బేతంచర్ల ను

మోడీ ఉపన్యాసంపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నేత
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్: జనవరి 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్యం:మంత్రి తుమ్మల

గూగుల్ మ్యాప్స్‌ను అతిగా నమ్మడం వల్ల పెను ప్రమాదం తప్పిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బేతంచర్ల నుంచి తెలంగాణలోని మక్తల్‌కు బండల లోడుతో బయలుదేరిన ఒక లారీ, గూగుల్ మ్యాప్స్ సూచించిన మార్గంలో వెళ్తూ నేరుగా కృష్ణా నది తీరంలోని ఘాట్‌కు చేరుకుంది. అప్పుడే సమయాన్ని గుర్తించిన డ్రైవర్ లారీని ఆపేయడంతో మేజర్ యాక్సిడెంట్ తప్పింది.

ఘటన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ బాషా జాతీయ రహదారి 44 మీదుగా కొత్తకోట వరకు వచ్చాడు. అక్కడి నుంచి మక్తల్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ సాయంతో ముందుకు సాగాడు. ఆత్మకూర్ చౌరస్తా చేరుకునే సరికి తెల్లవారుజాము అయింది. చౌరస్తాలో టర్న్ తీసుకోవాల్సి ఉండగా, మ్యాప్ ప్రకారం నేరుగా వెళ్తూ జూరాల గ్రామం వైపు ప్రయాణించాడు. గ్రామం దాటిన తర్వాత కూడా అలానే ముందుకు సాగాడు.ఇంతలో లారీ కుదుపులు ఎక్కువ కావడం, కొంత దూరంలో నీరు కనిపించడంతో డ్రైవర్‌కు అనుమానం కలిగింది. వెంటనే లారీని ఆపి దిగి చూడగా.. ఇంకాస్త దూరం వెళ్తే నేరుగా కృష్ణా నదిలోకి పడిపోయేదని తేలింది. ఇప్పటికే లారీ నది తీరంలోని ఘాట్ రోడ్డులోకి వెళ్లిపోయింది. డ్రైవర్ షాక్‌కు గురై, తక్షణమే టైర్ల కింద రాళ్లు అడ్డుపెట్టి లారీని నిలిపేశాడు.తర్వాత జూరాల గ్రామస్థులకు సమాచారమిచ్చి, లారీ ఓనర్‌కు జరిగిన విషయం చెప్పాడు. గ్రామస్థుల సాయంతో లారీని సురక్షితంగా బయటకు తీశారు.

ఈ ఘటన గూగుల్ మ్యాప్స్‌లో రోడ్ల అప్‌డేట్ లోపాల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో కృష్ణా నదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉండటంతో, కొన్ని ఘాట్ రోడ్లు బోటింగ్ లేదా ఇతర ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడతాయి – భారీ వాహనాలకు అనుకూలం కావు.ఈ ఘటన తర్వాత డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకుండా, స్థానిక రోడ్ల గురించి జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వెలుగుచూస్తూనే ఉన్నాయి.