•వాయిల సింగారం ఉపసర్పంచ్ ఎన్నికపై రగడ కోదాడ/నినాదం:అనంతగిరి మండలంలో సోమవారం ఉప సర్పంచ్ లను ఎన్నుకున్నారు. వీరిలో అమీనాబాద్ గోపతి కవిత, అనంతగిరి గవ
•వాయిల సింగారం ఉపసర్పంచ్ ఎన్నికపై రగడ
కోదాడ/నినాదం:
అనంతగిరి మండలంలో సోమవారం ఉప సర్పంచ్ లను ఎన్నుకున్నారు. వీరిలో అమీనాబాద్ గోపతి కవిత, అనంతగిరి గవిని రామకృష్ణ, లకారం దార పల్లి లక్ష్మారెడ్డి, గోండ్రియాల బండ్ల రమేష్, కొత్త గూడెం భాష్యం సురేష్, పాలారం బెల్లంకొండ అం జయ్య, చనుపల్లి దాసి నాగరాజు, త్రిపురవరం మామిడి నర్సింహారావు, యసంతాపురం మెండి తోక నాగమణి, వాయిలసింగారం కంటు రామా దేవి, కొత్తగోలండా బోడా నంద, పాతగోలేం డా గుగులోతు సేవ్యా, వెంకట్రాంపురం చల్ల కొటయ్య, ఖానాపురం గింజుపల్లి జగ్గయ్య, బొజ్జగూడెంతండా భూక్యా నాగమణి, మొగలాయికోట ఏర్పుల ఝాన్సీ, శాంతినగర్ గరిడేపల్లి స్వాతి ఎన్నికయ్యారు.
ఉప సర్పంచ్ ఎన్నిక రద్దు చేయాలి…
ఉప సర్పంచ్ ఎన్నిక రద్దుచేసి మరల ఎలక్షన్ నిర్వహించి మాకు న్యాయం చేయాలని అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నందిగామ శ్రీనివాస్, వార్డు మెంబర్లు బుర్ర భవాని, అమరబోయిన వంశీ, తమలపాకుల వెంకటేష్, చుండూరు రాణి సంతకాలతో కూడిన వినతి పత్రం కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణకు సోమవారం అందజేశారు..

