HomeEditor's ChoiceGeneral

కరువైన మానవత్వం – రోడ్డుమీదే ఒక నిండుప్రాణం పోయింది

కరువైన మానవత్వం – రోడ్డుమీదే ఒక నిండుప్రాణం పోయింది

కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని మంటకలిపే ఘటన చోటుచేసుకుంది. సౌత్ బెంగళూరు బాలాజీ నగర్‌కు చెందిన మెకానిక్ వెంకటరమణన్ (34) గుండెపోటుతో ప్రాణాపా

మోడీతో ప్రియాంకా గాంధీ చాయ్ పే చర్చ
ఆ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించలేదు -తీర్పు ఇచ్చిన స్పీకర్
అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌

కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని మంటకలిపే ఘటన చోటుచేసుకుంది. సౌత్ బెంగళూరు బాలాజీ నగర్‌కు చెందిన మెకానిక్ వెంకటరమణన్ (34) గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లగా, ఆసుపత్రుల నిర్లక్ష్యం, రోడ్డుపై వెళ్తున్నవారి ఉదాసీనత కారణంగా అతడు మృతి చెందాడు. భర్తను కాపాడుకునేందుకు భార్య చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వెంకటరమణన్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. గతంలో స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి వేగంగా దిగజారింది. స్పందించిన భార్య అతడిని బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అక్కడ వైద్యులు అందుబాటులో లేరని సిబ్బంది తిప్పి పంపేశారు.దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ ఈసీజీ చేసి స్వల్ప గుండెపోటు నిర్ధారించారు. కానీ, అత్యవసర చికిత్స అందించకుండా, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయకుండా జయనగర్‌లోని శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌కు తరలించమని సూచించారు.నిస్సహాయంగా మళ్లీ బైక్‌పై బయలుదేరిన దంపతులు మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. వెంకటరమణన్ రోడ్డుపై పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు.

సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు, భార్య రోడ్డుపై వెళ్తున్న ప్రతీ వాహనాన్ని ఆపి సహాయం కోరింది. కానీ, కార్లు, టెంపోలు, బైక్‌లు ఎవరూ ఆగకుండా వెళ్లిపోయాయి.కొంతసేపటి తర్వాత ఓ క్యాబ్ డ్రైవర్ ఆగి వారిని ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆలస్యమైపోయింది. ఆసుపత్రికి చేరేసరికి వెంకటరమణన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతుడికి ఐదేళ్ల కుమారుడు, 18 నెలల కుమార్తె ఉన్నారు. అతడి తల్లికి ఉన్న ఆరుగురు సంతానంలో ఐదుగురు ఇప్పటికే చనిపోగా, మిగిలిన ఏకైక కుమారుడు కూడా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది.అయినప్పటికీ, ఆ కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. వెంకటరమణన్ కళ్లను దానం చేసి ఇతరులకు చూపును ప్రసాదించారు. ఈ ఘటన ఆసుపత్రుల బాధ్యతారాహిత్యం, సమాజంలో మానవత్వ లోపం పై మరోసారి చర్చను రేకెత్తించింది. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.