HomeEditor's ChoiceGeneral

గెలిచిన సర్పంచిపై దాడి.. అంతర్గాంలో ఉద్రిక్తత

గెలిచిన సర్పంచిపై దాడి.. అంతర్గాంలో ఉద్రిక్తత

గోదావరిఖని, డిసెంబర్ 16 (నినాదం): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గాం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత పంచాయతీ ఎన్నిక

కాంగ్రెస్ నేతల ఇళ్లముందు చాకిరేవు పెడతాం -రజక సంఘం నేతలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన మనాలి ఠాకూర్
గోదావరిఖనిలో…వన్‌టౌన్ పోలీసుల నాకాబంది

గోదావరిఖని, డిసెంబర్ 16 (నినాదం): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గాం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానంగా కేటాయించిన గ్రామ సర్పంచ్‌గా ఆంగోత్ రవికుమార్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్తున్న సమయంలో, ఓటమిని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాడికి నిరసనగా సర్పంచ్ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, ప్రజల మద్దతుతో గెలిచిన తనపై ఓటమిని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు అకారణంగా దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.బాధితులు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో శాంతి భద్రతల కోసం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.