తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది.మంగళవారంనాడు 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది.మంగళవారంనాడు 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద లారీని నిలిపి ఉంచిన డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ (48)పై మరో లారీలో వచ్చిన ముగ్గురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపడంతో అక్కడికక్కడే సల్మాన్ మృతి చెందాడు.
ఘటన వివరాల ప్రకారం.. మహమ్మద్ సల్మాన్ తన లారీని పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వారు వచ్చిన లారీని చంద్రాయన్‌పల్లి వద్ద ఒక దాబా సమీపంలో వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది.తీవ్ర గాయాలతో ఉన్న సల్మాన్‌ను స్థానికులు వెంటనే ఇందల్‌వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స అందించేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న ఇందల్‌వాయి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి, దుండగులు ఎవరు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.ఈ దారుణ ఘటన ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. రహదారులపై భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

