తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత లీకుల వ్యవహారం పార్టీని కలవరపరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ ఎంపీలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలు మీడ
తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత లీకుల వ్యవహారం పార్టీని కలవరపరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ ఎంపీలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలు మీడియాకు లీక్ కావడంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకుల వెనుక ఉన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత గురువారం (డిసెంబర్ 11) ఢిల్లీలో ప్రధాని మోదీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ పనితీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రతిపక్ష పాత్రలో విఫలమవుతున్నారని, సోషల్ మీడియాలో కూడా ఒవైసీ పార్టీ కంటే వెనుకబడ్డారని విమర్శలు చేశారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు పార్టీలో కలకలం రేపాయి.ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందిస్తూ, మోదీ ఎలాంటి ‘క్లాస్’ తీసుకోలేదని, కేవలం పార్టీ బలోపేతం, సోషల్ మీడియా యాక్టివిటీ పెంచడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడం వంటి సానుకూల సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. అంతర్గత సమావేశ వివరాలను బయటకు లీక్ చేయడం తప్పుడు ప్రచారానికి దారితీస్తుందని, ఇలాంటి ‘లీకు వీరులు’ ఎవరో తేల్చి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పార్టీలో
అంతర్గత విభేదాలు బయటపడ్డాయా?
ఈ ఘటనతో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయనే చర్చ సాగుతోంది. పార్టీలో పాత నాయకులు, కొత్తగా చేరినవారి మధ్య సమన్వయం లేకపోవడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి వంటి అంశాలు ఇప్పటికే పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధాని సూచనలు అమలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ వివాదం తెలంగాణ బీజేపీకి కొత్త సవాలుగా మారింది. పార్టీ ఐక్యతపై దృష్టి పెట్టి ముందుకు సాగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

