తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ రోజు శాంతియుతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 36,483 పోలింగ్ క
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ రోజు శాంతియుతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 36,483 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.ఈ దశలో 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, 394 పంచాయతీల్లో సర్పంచ్‌లు, 7,908 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందువల్ల 3,752 సర్పంచ్ పోస్టులకు 12,652 అభ్యర్థులు, 28,410 వార్డు సభ్యుల పోస్టులకు 75,725 అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 53 లక్షలకు పైగా ఓటర్లు (పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు) ఓటు హక్కు వినియోగించుకున్నారని అంచనా.రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సున్నిత ప్రాంతాల్లో CCTVలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా పెంచారు. ఈ రోజు పోలింగ్ సమయంలో ఒకటి రెండు సంఘటనలు మినహా ఎక్కడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు.
మునుపటి దశల్లో (డిసెంబర్ 11, 14) కూడా పోలింగ్ శాంతియుతంగా జరిగింది – మొదటి దశలో 84.28%, రెండో దశలో 85.86% పోలింగ్ నమోదైంది.
కాగా, ఈ రోజు జరిగిన ఎన్నికల సందర్భంగా, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో రాములుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయిపై బీఆర్‌ఎస్ నేతలు దాడి చేశారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ – బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం పొగుల్లపల్లిలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ముకుమ్మడి దాడికి దిగారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈర్యతో పాటు నాలుగురు కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో బోరింగ్ తండాకు చెందిన భూక్య స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన మహిళను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

