ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసి పుచ్చారు. వారు పార్టీ పిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఐదుగురు బీఆరెస్
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసి పుచ్చారు. వారు పార్టీ పిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారు.
ఐదుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిలు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆరెస్ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ డిస్మిస్ చేశారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ మారిన వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆరెస్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చింది.
కాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీపిరాయింపు కేసు స్పీకర్ ముందు ఉంది.

