HomeEditor's ChoiceGeneral

క్యూబ్ నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింకులను హ్యాక్ చేసిన ఐ బొమ్మ రవి

క్యూబ్ నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింకులను హ్యాక్ చేసిన ఐ బొమ్మ రవి

ఐబొమ్మ (iBomma) పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 2025లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరె

హైదరాబాద్ లో మరో సారి డ్ర‌గ్స్ కలకలం – ప్రముఖ హీరోయిన్ సోదరుడు పరార్
ఐ బొమ్మ రవికి షాక్
గోదావరిఖనిలో…వన్‌టౌన్ పోలీసుల నాకాబంది

ఐబొమ్మ (iBomma) పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 2025లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన రవి, పైరసీ ద్వారా సుమారు రూ.20 కోట్లకు పైగా సంపాదించినట్లు ఒప్పుకున్నాడు
కరీబియన్ ద్వీపాల నుంచి ఈ నెట్‌వర్క్‌ను నడిపిన అతను, దాదాపు 21 వేలకు పైగా పైరేటెడ్ సినిమాలను స్టోర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు

తాజాగా, గురువారం (డిసెంబర్ 18, 2025) నాంపల్లి కోర్టు నాలుగు వేర్వేరు కేసుల్లో రవికి 12 రోజుల పోలీస్ కస్టడీని అనుమతించింది కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలు నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

ఈ విచారణలో రవి నోరు విప్పడంతో పైరసీకి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.రవి ఒప్పుకోలు ప్రకారం, సాధారణ ప్రింట్లతోపాటు క్యూబ్ నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింకులను హ్యాక్ చేసి సినిమాలను హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డు చేశాడు. ఈ పైరసీ కంటెంట్‌ను ‘హెచ్‌డీ హబ్’ పేరుతో ప్రత్యేక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసి, ఒక్కో లింక్‌కు 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేశాడు. ముఖ్యంగా ‘హిట్-3’, ‘కిష్కింద కాండం’ వంటి సినిమాలను శాటిలైట్ లింకుల ద్వారానే పైరసీ చేసినట్లు రవి అంగీకరించాడు

రవి నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని ఆధారాలు, ఇతర వ్యక్తుల ప్రమేయం బయటపడే అవకాశం ఉంది. తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి రావడం ఖాయమని పోలీసులు తెలిపారు.