ఐబొమ్మ రవి (ఇమ్మడి రవి) పైరసీ కేసులో తాజా పోలీసు విచారణలో మరిన్ని విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. మొత్త పైరసీ వ్యవహారంలో రవి కాకుండా మరో రెండు కొత్
ఐబొమ్మ రవి (ఇమ్మడి రవి) పైరసీ కేసులో తాజా పోలీసు విచారణలో మరిన్ని విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. మొత్త పైరసీ వ్యవహారంలో రవి కాకుండా మరో రెండు కొత్త పేర్లు బైటికొచ్చాయి.
పోలీసుల విచారణలో ప్రహ్లాద్, ప్రసాద్ అనే రెండు పేర్లు వెల్లడయ్యాయి. అయితే ఇందులో ప్రసాద్ విశాఖపట్నానికి చెందినవాడు, ఐబొమ్మ రవికి పదో తరగతి స్నేహితుడు. ఇటీవల పోలీసులు అతన్ని విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. కాగా ప్రహలాద్ ఎవరన్న దానిపై రవి నోరు విప్పడం లేదు. ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సును రవి తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్‌సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది. రవి తన గుర్తింపు దాచడానికి ప్రహ్లాద్ పేరును ఉపయోగించాడా లేక నిజంగానే ప్రహ్లాద్ అనే వ్యక్తి ఉన్నాడా అనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, రవి 2019 నుంచి ఐబొమ్మ, బప్పం టీవీ సహా 65కి పైగా మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా సుమారు 21,000 సినిమాలు పైరసీ చేశాడు. హెచ్‌డీ క్వాలిటీ సినిమాలను పైరసీ చేయడానికి క్యూబ్ సాటిలైట్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసి, శాటిలైట్ లింక్ ద్వారా రికార్డ్ చేశాడు. హిట్-3, కిష్కిందపురి, తండేల్ వంటి సినిమాలు ఇలాగే పైరసీ అయ్యాయి.
పైరసీ కంటెంట్‌ను టెలిగ్రామ్ ఛానెల్ (“H Hub”) ద్వారా విక్రయించాడు.

