బంగ్లాదేశ్‌లో నిన్న ఇవ్వాళ్ళ చెలరేగిన హింసాకాండతో ఆ దేశం అట్టుడుకుతోంది. హింసను అరికట్టడానికి సైన్యం రంగప్రవేశం చేసింది. 2024లో ప్రజాస్వామ్య ఉద్యమ
బంగ్లాదేశ్‌లో నిన్న ఇవ్వాళ్ళ చెలరేగిన హింసాకాండతో ఆ దేశం అట్టుడుకుతోంది. హింసను అరికట్టడానికి సైన్యం రంగప్రవేశం చేసింది.
2024లో ప్రజాస్వామ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూత్ లీడర్ షరీఫ్ ఓస్మాన్ హాదీపై కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న మరణించాడు. దీంతో ఢాకా, ఇతర ప్రధాన నగరాల్లో అల్లర్లు మొదలయ్యాయి. ఈ హింసలో మీడియా సంస్థలు, రాజకీయ కార్యాలయాలు, మైనారిటీలు లక్ష్యంగా మారాయి. ఇండియన్ మిషన్ దగ్గర కూడా దాడులు జరిగాయి, ఫలితంగా నలుగురు గాయపడ్డారు.
ప్రొటెస్టర్లు “ఇండియా బాయ్‌కాట్” నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు, ఇది రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల ప్రభావాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ హింసలో ప్రముఖ మీడియా సంస్థలు లక్ష్యంగా మారాయి. డైలీ ప్రొథమ్ అలో, డైలీ స్టార్ ఆఫీసులకు నిప్పు పెట్టారు, ఒక సీనియర్ ఎడిటర్‌పై భౌతిక దాడి జరిగింది.
అల్లరి మూకల దాడుల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ఇల్లు కూడా దహనమైంది. ఇవి యూనస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న యూత్ గ్రూపులు, రాడికల్ ఇస్లామిస్టుల చర్యలుగా చూస్తున్నారు. ఈ దాడుల్లో హిందువులు, బౌద్ధులు ఇతర మైనారిటీలు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రిస్టియన్లు, ట్రైబల్ కమ్యూనిటీలు కూడా భయాందోళనలో ఉన్నారు.
మరో వైపు యూనస్ ప్రభుత్వం శాంతికి పిలుపునిచ్చింది, కానీ యూత్ గ్రూపులు మాత్రం ప్రభుత్వం హాదీ మరణానికి కారకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి. స్థితి చేయి దాటిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్మీని ఢాకా వీధుల్లోకి దింపారు.

