HomeEditor's ChoiceGeneral

టీవీ ఛానల్ చర్చ మధ్యలో కుస్తీ, రాందేవ్ బాబాను ఎత్తిపడేసిన ప్యానలిస్ట్

టీవీ ఛానల్ చర్చ మధ్యలో కుస్తీ, రాందేవ్ బాబాను ఎత్తిపడేసిన ప్యానలిస్ట్

జాతీయ టీవీ ఛానెల్ అమర్ ఉజాలా టీవీలో జరిగిన లైవ్ డిబేట్‌లో రాందేవ్ బాబా ఒక ప్యానెలిస్ట్‌తో కుస్తీ పట్టిన ఘటన సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. చ

మెస్సీ హైదరాబాద్ టూర్ తెలంగాణ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది -రేవంత్ రెడ్డి
బుర్జ్ ఖలీఫాపై పిడుగు… వీడియో వైరల్ -షేర్ చేసిన‌ దుబాయ్ యువరాజు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి కృష్ణా నదిలోకి వెళ్ళిన లారీ

జాతీయ టీవీ ఛానెల్ అమర్ ఉజాలా టీవీలో జరిగిన లైవ్ డిబేట్‌లో రాందేవ్ బాబా ఒక ప్యానెలిస్ట్‌తో కుస్తీ పట్టిన ఘటన సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. చర్చ మధ్యలో తన బలాన్ని నిరూపించుకోవడానికి రామ్‌దేవ్ బాబా ప్యానెలిస్ట్ ను కుస్తీకి రమ్మని సవాల్ చేసి అతన్ని ఎత్తిపడేయాలని అనుకున్నాడు. అయితే ఆ ప్యానెలిస్ట్ ధీటుగా ఎదురుదాడి చేసి, బాబాను ఎత్తి నేలపై పడేశాడు.

ఈ ఘటన డిసెంబర్ 19, 2025న జరిగినట్లు తెలుస్తోంది. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందింది. బాబా రామ్‌దేవ్ సఫ్రాన్ దుస్తుల్లో కనిపిస్తూ, సరదాగా లేదా బలం చూపించేందుకు కుస్తీ మూవ్ ప్రయోగించినట్లు కనిపిస్తోంది. కానీ ప్యానెలిస్ట్ ఎదురుగా నిలిచి బాబాను నేలపైకి తోసేశాడు. దీంతో స్టూడియోలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.ఈ సంఘటన తర్వాత బాబా రామ్‌దేవ్ స్పందిస్తూ, అదంతా సరదా కోసమే చేసినట్లు వివరణ ఇచ్చారు. సీరియస్‌గా తీసుకోవద్దని కోరారు. అయినప్పటికీ, నెటిజన్లు ఈ వీడియోపై మీమ్స్, ట్రోల్స్‌తో రాందేవ్ ను ట్రోల్ చేశారు. “పతంజలి నెయ్యి తింటే ఇలాగే జరుగుతుంది”, “స్కామ్‌దేవ్” వంటి కామెంట్లు వర్షం కురుస్తున్నాయి.

మరోవైపు, టీవీ ఛానెళ్లు టీఆర్‌పీల కోసం చర్చలను కుస్తీ అఖాడాలుగా మారుస్తున్నాయంటూ మీడియా విశ్లేషకులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన భారతీయ టీవీ డిబేట్ల స్థాయిని మరోసారి ప్రశ్నార్థకం చేసింది. బాబా రామ్‌దేవ్ గతంలోనూ ఇలాంటి సంఘటనల్లో పాల్గొన్న చరిత్ర ఉంది, కానీ ఈసారి ఆయనకు బ్యాక్‌ఫైర్ అయినట్లు కనిపిస్తోంది.ఈ వీడియో ఇప్పటికే లక్షలాది వ్యూస్ సాధించి, సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.