కోదాడ (నినాదం): కోదాడకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం ని సస్
కోదాడ (నినాదం):
కోదాడకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం ని సస్పెండ్ చేస్తూ, చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లాకప్‌లో రాజేష్ మృతి చెందిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటన రీత్యా అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూరల్ సీఐపై కూడా చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఎమ్మార్పీఎస్ ఆందోళనలు
రాజేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉధృత ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాకప్ డెత్‌కు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖ అంతర్గత విచారణ వేగవంతం చేసి, సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
మరిన్ని చర్యలపై ఉత్కంఠ
లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో పాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

