HomeEditor's ChoiceGeneral

గాదె ఇన్నారెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

గాదె ఇన్నారెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

భారత్ బచావో ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డిపై ఎన్ ఐ ఏ (NIA ) పోలీసులు అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడాన్ని పూర్వ విప్లవ విద్యా

మావోయిస్టు పార్టీ ప్రకటన‌: 16 మంది అరెస్టు అక్రమం…బీజేపీ ఎజెండాకు మద్దతు ఇవ్వొద్దు
మహిళ వేషంలో దాక్కున్న పోలీసు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

భారత్ బచావో ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డిపై ఎన్ ఐ ఏ (NIA ) పోలీసులు అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడాన్ని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. కామ్రేడ్ క‌ట్టా రామచంద్రా రెడ్డి అంత్య క్రియల సందర్భ‍ంగా ఇన్నయ్య మాట్లాడిన మాటల ఆధారంగా ఆయనపై కేసు బనాయించడం అప్రజాస్వామికం.కట్టా రామచంద్రా రెడ్డిది ఎన్ కౌంటర్ కాదని, అతన్ని పట్టుకొని హత్య చేశారనే అనుమానాలను ఇన్నయ్య వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ ఎన్ కౌంటర్ల తీరును ఇన్నయ్య తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన‌ మాటల ఆధారంగా క్రూరమైన, రాజ్యాంగ విరుద్దమైన UAPA కేసు బనాయించడం బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు చేసిన కుట్రనే. ఇది భావప్రకటనా స్వేచ్చపై దాడిగానే మేము భావిస్తున్నాం.

ఇన్నయ్య నడుపుతున్న మన ఇల్లు అనే అనాధాశ్రమంలోకి పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించడం, ఆశ్రమం చుట్టూ పోలీసులను మోహరించడం, ఆశ్రమంలో ఉన్న పిల్లలను, గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ప్రతి ఒక్కరూ ఖండిచాల్సిన చర్య‌. ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని, ఇన్నయ్య అరెస్టును వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఆయన విడుదలకై రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

సాంబమూర్తి,
కన్వీనర్,
పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక‌