తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ దగ్గర పార్టీ పిరాయింపుల కేసు పెండింగు లో ఉన్న నేపథ్యంలో తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ దగ్గర పార్టీ పిరాయింపుల కేసు పెండింగు లో ఉన్న నేపథ్యంలో తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. బీఆరెస్ తరపున గెలిచిన కాంగ్రెస్ లో చేరిన ఆయనపై పార్టీ పిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించాలని బీఆరెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధమైన ప్రకటన చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో, వారు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు నేను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే” అని వ్యాఖ్యానించారు. రాబోయే GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని చెప్పిన నాగేందర్ ఎంఐఎంతో కలిసి మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇక నాగేందర్ స్వయంగా తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని ప్రకటించడంతో ఆయనపై స్పీకర్ చర్యతీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలంటున్నాయి.

