కోదాడ/నినాదం:న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2026 దృష్ట్యా పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆంక్షలు అమలులోకి తెచ్చారు. డిసెంబర్
కోదాడ/నినాదం:
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2026 దృష్ట్యా పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆంక్షలు అమలులోకి తెచ్చారు. డిసెంబర్ 31వ రాత్రి జాతీయ రహదారులపై, స్థానిక రోడ్లపై నూతన సంవత్సర వేడుకలు అనుమతించబడవని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజా రహదారులు,అన్ని ప్రమాదాలకు గురయ్యే సున్నిత ప్రాంతాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేయనునట్టు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఫైర్ క్రాకర్స్ కాల్చడాన్ని పోలీసులు నిషేధించారు. మద్యం మత్తులో , సైలెన్సర్లు లేకుండా వాహనాలు నడపరాదు. అలాంటి రైడర్స్ పై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టనున్నారు.మద్యం తాగి వాహనాలను నడిపే వారిని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపిన డ్రైవర్లను కోర్టులో హాజరుపరచడం ద్వారా మెజిస్ట్రేట్ భారీగా ఫైన్ విధించే అవకాశం వుందని పోలీసులు తెలిపారు. బార్‌లను నిర్ణీత సమయంలో మూసివేయాలని, డీజేలు నిషేధించామని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోడ్లపై యువత మద్యం బాటిళ్లు బీర్లు తాగుతూ వీధుల్లో నడుస్తూ బైక్స్ పై తిరుగుతూ ఆడవాళ్లపై బాలికలపై టీజింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
సైలెన్సర్ లేని బైక్ లను సీజ్ చేస్తామన్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు వుంటాయన్నారు. స్నేహపూర్వక వాతావరణం లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ విచక్షణ రహితంగా స్పీడ్ గా బైక్ కార్ ఇతర వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దన్నారు. న్యూ ఇయర్ పార్టీ ఎవరి జీవితాల్లో, కుటుంబాల్లో విషాదం మిగల్చరాదు అని ఆకాంక్షిస్తున్నామని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

