HomeEditor's ChoiceGeneral

అది పితృస్వామ్య అహంకారామే -అనసూయ కామెంట్

అది పితృస్వామ్య అహంకారామే -అనసూయ కామెంట్

నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన శివాజీ నటి అనసూయ గురించి మ

నటుడు శివాజీ హీరోయిన్లపై పురుషాహంకార ‘XXX’ వ్యాఖ్యలు…. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్న మహిళలు
సంస్కారహీనుడు, మురికివాడు: శివాజీపై నిప్పులు చెరిగిన‌ రాంగోపాల్ వర్మ‌
క్షమాపణ చెప్పిన శివాజీ… అందులో నిజాయితీ ఉందా ?

నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన శివాజీ నటి అనసూయ గురించి మళ్ళీ కామెంట్ చేయడంతో అనసూయ తీవ్రంగా స్పందించారు. ఆమె తన ట్విట్టర్ పోస్ట్ లో

”కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది..

ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదు.

కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన గ్లోరిఫికేషన్ సమంజసం కాదు / అభినందనీయం కాదు.” అని అన్నారు.