•పార్టీ ఆవిర్భావం పురస్కరించుకొని శాంతినగర్ లో జెండా ఆవిష్కరణ.. •పేదల పక్షాన అలుపెరిగిన పోరాటం చేసేది కమ్యూనిస్టులే.. •సిపిఐ జిల్లా కార్యవర్గ స
•పార్టీ ఆవిర్భావం పురస్కరించుకొని శాంతినగర్ లో జెండా ఆవిష్కరణ..
•పేదల పక్షాన అలుపెరిగిన పోరాటం చేసేది కమ్యూనిస్టులే..
•సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి
కోదాడ/నినాదం:
భారతదేశ రాజకీయాలలో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజాప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరిగిన పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఎన్డీఏ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవం
సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా శుక్రవారం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో సిపిఐ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ… 1925, డిసెంబర్ 26 ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సిపిఐ పార్టీ ఆవిర్భవించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. దేశంలో వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమేనన్నారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న వారందరూ స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తింపబడ్డారన్నారు. కమ్యూనిస్టుపార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరి సహకారంతో యుపిఏ వన్ ప్రభుత్వంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్ర ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నదనీ మండిపడ్డారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ కనుసనల్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్రోద్యమ పితామహుడు మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాలకు తీసేస్తూ దేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నీరుగారుస్తున్నారని విమర్శించారు.ఈ నేపథ్యంలో సిపిఐ వందేళ్ళ వార్షికోత్సవ ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో పాలకులనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు ప్రజలు సమాయత్తం కావాలన్నారు. 2026 జనవరి 18న ఖమ్మంలో జరిగే జాతీయస్థాయి సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.సిపిఐ మండల కార్యదర్శి ఎర్ర సాని రవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగభద్రం, మండల యువజన సంఘం అధ్యక్షులు డేగ వీరయ్య, శాంతినగర్ అనంతగిరి గ్రామ శాఖ కార్యదర్శి శాంతినగర్ నూతన సర్పంచ్ ఉమా, ఉప సర్పంచ్ స్వాతి వార్డు సభ్యురాలు స్నేహ, వార్డు సభ్యులు నరేష్ వెంకటేశ్వర్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

