HomeEditor's ChoiceGeneral

మోడీ సభలో సమోసాల కోసం తన్నుకున్న బీజేపీ కార్యకర్తలు

మోడీ సభలో సమోసాల కోసం తన్నుకున్న బీజేపీ కార్యకర్తలు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమం అనూహ్య ఘటనకు వేదికైంది

మోడీ ఉపన్యాసంపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నేత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మృతి
మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమం అనూహ్య ఘటనకు వేదికైంది. రాష్ట్రీయ ప్రేరణా స్థల్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఒకవైపు మోడీ మాట్లాడుతుండగానే సమోసాల పంపిణీ విషయంలో బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే సభ ప్రాంగణంలో సమోసాలు, ఇతర రిఫ్రెష్‌మెంట్స్ పంచుతున్నారు. కొందరికి సమోసాలు అందకపోవడంతో వాగ్వాదం మొదలైంది. బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ముగ్గురు దాడి చేసుకున్నారు. చెంపదెబ్బలు, మోకాళ్లతో తన్నులు, ఈడ్చుకొని వెళ్ళడం వంటివి జరిగాయి. ఒకరు కుర్చీలపై పడిపోయారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు నేపథ్యంలో మోదీ ప్రసంగం స్పష్టంగా వినిపిస్తోంది – ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తున్నారు.

కాగా అక్కడే ఉన్న కొందరు ఈ గొడవలో జోక్యం చేసుకుని ఘర్షణను అదుపు చేశారు. కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఈ సంఘటనపై నెటిజన్లు హాస్యంగా, సెటైరికల్‌గా కామెంట్లు పెడుతున్నారు:”వన్ నేషన్, వన్ సమోసా” (One Nation One Samosa) అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ అయింది.”సమోసాలే ముఖ్యం, రాజకీయాలు కాదు” అంటూ కొందరు.”జబ్ తక్ రహేగా సమోసే మే ఆలూ, తబ్ తక్ లడ్తే రహేంగే రాజూ ఔర్ కాలూ” వంటి హాస్య కామెంట్లు చేయగా మరికొందరు సివిక్ సెన్స్ లేకపోవడం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లోపాలను విమర్శిస్తున్నారు.

ఈ ఘటనతో పాటు, కార్యక్రమం ముగిసిన తర్వాత సభా ప్రాంగణం చుట్టూ అమర్చిన అలంకరణ పూల కుండీలను (సుమారు 4,000కు పైగా) ప్రజలు తీసుకెళ్లిపోయిన మరో వీడియో కూడా వైరల్ అయింది.ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.