HomeEditor's ChoiceGeneral

అల్లు అర్జున్ పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు

అల్లు అర్జున్ పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు 'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఒక

ప్రభాస్, చిరంజీవి,వెంకటేష్ లకు హైకోర్టులో ఊరట‌
నన్ను క్షమించండి… చేతులు జోడించిన ఆదిపురుష్ డైలాగ్ రైటర్
అది పితృస్వామ్య అహంకారామే -అనసూయ కామెంట్

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించడం, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడటంతో తీవ్ర వివాదం రేగింది.

2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. నటుడు అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భారీ జనసమూహం కారణంగా ఈ ఘటన సంభవించింది. 35 ఏళ్ల ఎం. రేవతి అనే మహిళ ఊపిరాడక మరణించారు. ఆమె 9 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందాడు. శ్రీతేజ్ సెమీ-కాన్షస్ స్టేట్‌లో ఉండి, వెంటిలేటర్ సపోర్ట్‌తో 4 నెలలకు పైగా చికిత్స పొంది, 2025 ఏప్రిల్ 29న డిస్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం న్యూరో-రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స కొనసాగుతోంది.

అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో అభిమానులు భారీగా తరలిరావడం, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యం, సెక్యూరిటీ లోపాలు ప్రధాన కారణాలుగా పోలీసులు గుర్తించారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ స్టాఫ్ ముందస్తు ఏర్పాట్లు చేయకపోలేదని దర్యాప్తులో వెల్లడైంది.

కాగా, ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇది సుమారు 100 పేజీలుంది. ఇందులో మొత్తం 23 మంది నిందితులు కాగా, అల్లు అర్జున్‌ను A-11 (అక్యూజ్డ్ నెంబర్ 11)గా పేర్కొన్నారు.
ఇతర నిందితుల‌లో అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్, సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్ (ప్రైమ్ అక్యూజ్డ్‌గా), థియేటర్ యజమాని, మేనేజర్ మొదలైనవారు ఉన్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 304 (కల్పేబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్), 105 మొదలైన సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఛార్జ్‌షీట్‌లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలు, నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రధానంగా పేర్కొనబడ్డాయి.

దర్యాప్తులో అల్లు అర్జున్‌తో సహా నిందితులను పలుమార్లు విచారించారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రిపోర్టులు వంటి సాక్ష్యాలు ఛార్జ్‌షీట్‌లో చేర్చబడ్డాయి. సాక్షుల వాంగ్మూలాలు స్పెసిఫిక్‌గా పేర్కొనబడలేదు, కానీ అన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేయబడినట్లు పోలీసులు తెలిపారు.

ఛార్జ్‌షీట్ దాఖలుతో కోర్టులో లీగల్ ప్రాసెస్ ప్రారంభమైంది. అల్లు అర్జున్ 2024 డిసెంబర్ 13న అరెస్ట్ అయి, తర్వాత ఇంటరిమ్ బెయిల్ పొందారు.