HomeEditor's ChoiceGeneral

అసెంబ్లీ సమావేశాలుప్రారంభం… రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలుప్రారంభం… రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన కేసీఆర్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. విపక్ష నేత కేసీఆర్, కేటీఆర్, టీ హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో పాల్గొన్నా

BRS:అసెంబ్లీ నుంచి ఈరోజు వాకౌట్, రేపు బహిష్కరణ
అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించిన కేసీఆర్
ఆ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించలేదు -తీర్పు ఇచ్చిన స్పీకర్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. విపక్ష నేత కేసీఆర్, కేటీఆర్, టీ హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో పాల్గొన్నారు.సమావేశాలు మొదలైన తర్వాత సభ ముందుగా దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి, సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సభను వాయిదా వేశారు. సభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చి నమస్కరించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా, మాజీ సీఎం కేసీఆర్ సభలో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉండి, సంతాప తీర్మానాల అనంతరం వెళ్లిపోయారు.

మరో వైపు బీఆర్ఎస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులు, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దమయ్యింది. ఈ సమావేశాల్లో నదీ జలాల పంపిణీ, ఇరిగేషన్ ఇష్యూలపై తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే , పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ చుట్టూ దాదాపు వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.