ఆటో డ్రైవర్స్‌కు అవగాహన కల్పించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి గోదావరిఖని, డిసెంబర్ 30 ,(నినాదం): రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధన
ఆటో డ్రైవర్స్‌కు అవగాహన కల్పించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి
గోదావరిఖని, డిసెంబర్ 30 ,(నినాదం): రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆటో డ్రైవర్స్‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. వాహన ధ్రువపత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు.
ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్స్ కీలక పాత్ర వహిస్తారని సీఐ తెలిపారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనం నడిపితే అనేక ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. ఆటోల్లో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంచుకోవడం ద్వారా తప్పుదారులు పడకుండా ఉండే భావన కలుగుతుందని సూచించారు.
కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్య ప్రవర్తనతో ఆటో డ్రైవర్ల అందరికీ చెడు పేరు వస్తోందని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వర్తించాలంటే డ్రైవర్‌కు లైసెన్స్ ఉండాలన్నది గుర్తుచేశారు.

