HomeEditor's ChoiceGeneral

ఈ రోజు రాత్రి మత్తెక్కువైతే ఇంటికి తీసుకెళ్ళేందుకు బైక్ ఫ్రీ

ఈ రోజు రాత్రి మత్తెక్కువైతే ఇంటికి తీసుకెళ్ళేందుకు బైక్ ఫ్రీ

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీల్లో మద్యం సేవించివారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తాము ఉచితంగా రవాణా సేవలు అందిస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్

ఐపీఎల్ ప్రసారాలను నిషేధించిన బంగ్లాదేశ్‌
చివరి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి
నేటి కాలానికి కావాల్సిన మరో నీతి శతకం

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీల్లో మద్యం సేవించివారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తాము ఉచితంగా రవాణా సేవలు అందిస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) ప్రకటించింది.
ఈ ఇనిషియేటివ్ ద్వారా మద్యపానం చేసి వాహనాలు నడపకుండా నిరోధించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని యూనియన్ నేతలు తెలిపారు.

ఈ సేవలు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మాత్రమే ఈ ఉచిత రైడ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఉచిత రైడ్ల కోసం మొత్తం 500 వాహనాలను సిద్దం చేసినట్టు యూనియన్ వెల్లడించింది. అవసరమైనవారు ఈ సేవలను 8977009804 నంబర్‌కు కాల్ చేసి పొందవచ్చు. మద్యం సేవించి స్వయంగా వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారు మాత్రమే ఈ సేవను ఉపయోగించుకోవాలని యూనియన్ సూచించింది.

టీజీపీడబ్ల్యూయూ ఈ కార్యక్రమాన్ని బిజిలీరైడ్ సంస్థతో కలిసి నిర్వహిస్తోంది.

“మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఏటా వేలాది ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మా యూనియన్ గిగ్ వర్కర్లు ఈ సందర్భంగా సమాజానికి సేవ చేయాలని నిర్ణయించాం” అని టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ తెలిపారు.

ఈ ఇనిషియేటివ్‌ను హైదరాబాద్ పోలీసులు కూడా స్వాగతించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గత సంవత్సరాల్లో కూడా టీజీపీడబ్ల్యూయూ ఇలాంటి సేవలు అందించింది. ఈసారి మరిన్ని వాహనాలు, డ్రైవర్లను సిద్ధం చేశామని యూనియన్ తెలిపింది. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని యూనియన్ కోరింది. మరిన్ని వివరాలకు యూనియన్ సోషల్ మీడియా ఖాతాలు లేదా పై నంబర్‌ను సంప్రదించవచ్చు