పట్టణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్ ఆర్ ఎస్ అకాడమీ.అకాడమీ తరుపున స్కూల్ స్థాపించడం అభినందనీయం. కోదాడ/నినాదం: ప్రస్తుత సమాజంలో విద్
పట్టణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్ ఆర్ ఎస్ అకాడమీ.
అకాడమీ తరుపున స్కూల్ స్థాపించడం అభినందనీయం.
కోదాడ/నినాదం
: ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీ బీ ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వీ.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ ఎస్ వీ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎన్ ఆర్ ఎస్ ఐ ఐ టీ & మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కోదాడ వంటి పట్టణ ప్రాంతాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తయారుచేస్తున్న ఎన్ ఆర్ ఎస్ అకాడమీ కృషి అభినందనీయమన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ రూరల్ ప్రాంత విద్యార్థులు సరైన ఫౌండేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్మీడియట్ లో రాణించలేక పోతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ ఆర్ ఎస్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించడం హర్షణీయమన్నారు. 8వ తరగతి నుండి ఐఐటీ, నీట్ లకు ఫౌండేషన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులను జాతీయ స్థాయి ర్యాంకర్లుగా మార్చేందుకు, వారు జీవితం లో ఉన్నత స్థాయిలో రాణించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు తాము చదువున్న విద్యా సంస్థ కు అతిథిగా వెళ్ళడం గొప్ప విషయమని, దానిని విద్యార్థులు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ఆవిర్భావం, దానికి గల కారణాలు, సంస్థ లక్ష్యాల గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన తాను సరైన ఫౌండేషన్ లేక పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ అకాడమీ ఏర్పాటు చేశామని, అదే విధంగా స్కూల్ ను స్తాపిస్తున్నట్లు తెలిపారు. తమ లక్ష్యాలు సాధించేందుకు తమకు సహకరిస్తున్న విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నూతనంగా స్థాపించే ఎన్ ఆర్ ఎస్ స్కూల్ లోగో లను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, అకాడమీ కరస్పాండెంట్ వేణుగోపాల్ రావు,అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ (జీ వీ), వైస్ ప్రిన్సిపాల్ పీ . నాగేశ్వర రావు(పీ ఎన్ ఆర్), ఏ వో లు మౌనిక, పీ ఆర్ వో మల్లికార్జున్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

