HomeEditor's ChoiceGeneral

పరుగు పందెంలో వెంకట్రాపురం యువకుడికి గోల్డ్ మెడల్

పరుగు పందెంలో వెంకట్రాపురం యువకుడికి గోల్డ్ మెడల్

నేపాల్ వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డ సతీష్.. సతీష్ కు అండగా నినాదం పత్రిక… పరుగు వీరుడి ప్రతిభకు పేదరికం అడ్డు.. వార్త కథనం ప్రచురం.. కథనా

మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం… కేటీఆర్
ఆదివాసీ యువకుడి మొహంపై మూత్రం పోసే భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది ? వారే తిరగబడితే ఏం జరుగుతుంది?
‘గ్రామాల అభివృద్దికి ఇలాంటి నాయకులే కావాలి’

నేపాల్ వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డ సతీష్..

సతీష్ కు అండగా నినాదం పత్రిక… పరుగు వీరుడి ప్రతిభకు పేదరికం అడ్డు.. వార్త కథనం ప్రచురం..

కథనానికి స్పందించి దాతలు 26 వేల రూపాయల ఆర్థిక సహాయం…

కోదాడ/నినాదం:
అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన యువకుడు వద్దేబోయిన సతీష్ పరుగు పందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. గత నెల 28 నుండి నేపాలలో జరిగే అంతర్జాతీయ యూత్ గేమ్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 11.58 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీలో ఇండియా తో పాటు నేపాల్, భూటాన్ దేశాలు పాల్గొన్నాయి…ఈ సందర్భంగా సతీష్ ను గ్రామస్తులతో పాటు క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించారు. నేపాల్ వెళ్లేందుకు సతీష్ ఆర్థికంగా ఖర్చులకు లేక ఇబ్బంది పడ్డాడు. ఇదే విషయం నినాదం పత్రిక ఇంచార్జ్ నరేష్ కు ఫోన్ ద్వారా తన ఇబ్బందులను తెలియజేశారు… స్పందించిన నినాదం.. సతీష్ కు అండగా పరుగు వీరుడు ప్రతిభకు పేదరికం అడ్డు అనే వార్త కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త కథనానికి స్పందించిన దాతలు కత్రం ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి 20000 రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా గ్రామానికి చెందిన సర్పంచ్ బోలికొండ జయరాజ్ రెండు వేల రూపాయలు, తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు సైదులు 2000, కానాపురం గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ శీలం నాగేంద్రబాబు 2000 రూపాయలు సహాయం చేశారు…. సకాలంలో స్పందించిన నినాదంకు సతీష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…