HomeEditor's ChoiceGeneral

BRS:అసెంబ్లీ నుంచి ఈరోజు వాకౌట్, రేపు బహిష్కరణ

BRS:అసెంబ్లీ నుంచి ఈరోజు వాకౌట్, రేపు బహిష్కరణ

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో తీవ్ర నిరసన వ్యక్త

29న అసెంబ్లీకి.. కేసీఆర్ వస్తున్నాడోచ్…!
అసెంబ్లీ సమావేశాలుప్రారంభం… రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన కేసీఆర్
ఆ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించలేదు -తీర్పు ఇచ్చిన స్పీకర్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ సుందరీకరణ అంశంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కుమార్ పక్షపాతి వైఖరికి నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల బహిష్కరించనున్నట్లుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లుగా ఆయన తెలిపారు.

బీఆరెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశాక‌ కాలినడకన ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోకి వెళ్లి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఇదే సందర్భంగా బీఆర్ఎస్ రేపు (జనవరి 3) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని కూడా నిర్ణయించినట్టు హరీష్ రావు ప్రకటించారు.