HomeEditor's ChoiceGeneral

చైనా, పాక్ లకు వ్యతిరేకంగా మాకు మద్దతు ఇవ్వండి – భారత్ కు బలూచ్ ప్రతినిధి లేఖ‌

చైనా, పాక్ లకు వ్యతిరేకంగా మాకు మద్దతు ఇవ్వండి – భారత్ కు బలూచ్ ప్రతినిధి లేఖ‌

బలూచిస్థాన్ మానవ హక్కుల నేత‌, బలూచ్ రిపబ్లిక్ ప్రతినిధి మీర్ యార్ బలూచ్ (Mir Yar Baloch), భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు జనవరి 1, 2026న బహిరంగ

భారత్ పై సుంకాలు మరింతగా పెంచుతా…నన్ను సంతోషపెట్టాలని మోడీకి తెలుసు -ట్రంప్
ఐపీఎల్ ప్రసారాలను నిషేధించిన బంగ్లాదేశ్‌
హింసతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ ‍- తమ పౌరులకు అలర్ట్ జారీ చేసిన ఇండియా, అమెరికా, బ్రిటన్

బలూచిస్థాన్ మానవ హక్కుల నేత‌, బలూచ్ రిపబ్లిక్ ప్రతినిధి మీర్ యార్ బలూచ్ (Mir Yar Baloch), భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు జనవరి 1, 2026న బహిరంగ లేఖ రాశారు. పాకిస్థాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజల పోరాటానికి భారత్ మద్దతు ఇవ్వాలని, రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని ఆ లేఖలో కోరారు.

లేఖ నేపథ్యం:మీర్ యార్ బలూచ్, బలూచ్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ సభ్యుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, డిప్లమాట్. బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ఆక్రమణ‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఈ లేఖలో, బలూచిస్థాన్ 6 కోట్ల ప్రజల తరపున భారత్ 140 కోట్ల ప్రజలు, పార్లమెంట్, మీడియా, సివిల్ సొసైటీకి 2026 న్యూ ఇయర్ విషెస్ అని పేర్కొన్నమీర్ యార్ బలూచ్ రెండు దేశాల మధ్య శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక, వాణిజ్య, ఆర్థిక, డిప్లమాటిక్, డిఫెన్స్ సంబంధాలను ప్రస్తావించారు.

గత 79 సంవత్సరాలుగా పాకిస్థాన్ ఆక్యుపేషన్, స్టేట్-స్పాన్సర్డ్ టెర్రరిజం, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు ఎదుర్కొంటున్నామని వివరించారు. ఈ సమస్యలను రూట్ లెవల్‌లో పరిష్కరించాలని, బలూచిస్థాన్ స్వాతంత్య్రానికి సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

పాకిస్థాన్-చైనా స్ట్రాటజిక్ అలయన్స్ ప్రమాదకరమని ఆయన‌ అభివర్ణించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) చివరి దశలో ఉందని, చైనా కొన్ని నెలల్లో బలూచిస్థాన్‌లో మిలిటరీని దించుతుందని అన్నారు. చైనా సైనికులు బలూచ్ మట్టిపై అడుగుపెట్టడం ఆరు కోట్ల బలూచ్ ప్రజల ఇష్టానికి వ్యతిరేకమని, ఇది భారత్, బలూచిస్థాన్ భవిష్యత్తు కు కూడా ప్రమాదమని పేర్కొన్నారు.

భారత్, బలుచిస్తాన్ ల మధ్య స్నేహ సహకారాలు అవసరమని, తక్షణ ప్రమాదాన్ని ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలని ఆయన సూచించారు.

ఈ లేఖ బలూచ్ పోరాటాన్ని అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ చేస్తోంది. మీర్ యార్ బలూచ్ గతంలో కూడా భారత్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లేఖలు రాశారు.

కాగా, ఈ లేఖపై భారత్ నుంచి కానీ పాకిస్తాన్, చైనాల నుంచి కానీ ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చను రేపుతోంది.