HomeEditor's ChoiceGeneral

వాళ్ళ ఒళ్ళంతా విషమే -బీఆరెస్ పై రేవంత్ మండిపాటు

వాళ్ళ ఒళ్ళంతా విషమే -బీఆరెస్ పై రేవంత్ మండిపాటు

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు పునఃప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించారు. ప్రధానంగా మూసీ నది సుందరీకరణ ప్రాజెక్

BRS:అసెంబ్లీ నుంచి ఈరోజు వాకౌట్, రేపు బహిష్కరణ
ఆ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించలేదు -తీర్పు ఇచ్చిన స్పీకర్
29న అసెంబ్లీకి.. కేసీఆర్ వస్తున్నాడోచ్…!

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు పునఃప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించారు. ప్రధానంగా మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు (మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్)పై దృష్టి సారించిన ఆయన ప్రసంగం వేడి చర్చకు దారితీసింది.

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బీఆరెస్ సభ్యులవైపు చేయి చీపిస్తూ రేవంత్ రెడ్డి, ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువగా ఉందని మండిప‌డ్డారు. తాము వివరాలు చెప్తుంటే.. ఎందుకు విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు తెలియొద్దని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.. ఆ కండ్లు చూడండి.

మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రక్షాళన చేయాలి అంటే సలహాలు ఇవ్వండి.. నష్టపోతున్న వారికి కాలనీ కట్టిస్తాం.. నష్టపోయిన వారికి వ్యాపారం చేసుకునే వేసులుబాటు కల్పిస్తామని రేవంత్ చెప్పారు.

రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పందనకు అవకాశం ఇవ్వకపోవడం, రైతుల యూరియా సమస్యలపై చర్చకు అవకాశం నిరాకరించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం రాజకీయ వేడి పుట్టించింది.