HomeEditor's ChoiceGeneral

యూట్యూబర్ అన్వేష్ కేసు: ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు

యూట్యూబర్ అన్వేష్ కేసు: ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు

ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ ఛానల్)పై హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడణె ఆరోపణలతో నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాగుట్ట

ఇన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం -మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
బుల్డోజర్ రాజ్యంలో ఈ వృద్దులు, మహిళలు చేసిన పాపమేంటి ? తప్పు ఒకరు చేస్తే మరొకరిని రోడ్డుపాలు చేస్తారా ?
ఐబొమ్మ రవి కేసు:వెలుగు చూస్తున్న కొత్త విషయాలు… ప్రహ్లాద్ ఎవరు ?

ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ ఛానల్)పై హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడణె ఆరోపణలతో నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలు కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ కంపెనీకి లేఖ రాశారు.

టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అన్వేష్ ఒక వీడియోలో సీత, ద్రౌపది గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు డిసెంబర్ 30న బీజేపీ నాయకురాలు, నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 351 (క్రిమినల్ ఇంటిమిడేషన్), 352 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో అవమానం)లతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అన్వేష్ పై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అన్వేష్ అరెస్ట్‌ను డిమాండ్ చేసింది. అతని యూట్యూబ్ ఛానల్‌ను బ్యాన్ చేయాలని కోరింది.

కాగా, కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు, అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ, ఇతర వివరాలు తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు.