కోదాడ/నినాదం:అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ ఆలేటి సహదేవ లిమ్కా బుక్ రికార్డులో పేరు సంపాదించాడు.విజన్ మార్క్స్ అకాడమీ వారు హ
కోదాడ/నినాదం:
అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ ఆలేటి సహదేవ లిమ్కా బుక్ రికార్డులో పేరు సంపాదించాడు.
విజన్ మార్క్స్ అకాడమీ వారు హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నవంబరు 23న నిర్వహించిన మోస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్ హౌస్ కిక్స్ ఇన్ థర్టీ మినిట్స్ కార్యక్రమంలో 30 నిమిషాలలో 927 మంది 10 రాష్ట్రాల వారు పాల్గొని 855460 కిక్స్ కొట్టారు. కాగా అందులో కరాటే మాస్టర్ ఆలేటి సహదేవ్ సెవెంత్ డాన్ పాల్గొని లిమ్కా బుక్ రికార్డులో పేరు సంపాదించాడు. ఆయనకు బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని అందించారు. సందర్భంగా సహదేవ ను గ్రామస్తులతో పలువురు అభినందించారు.

