ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహు చేసిన వ్యాఖ్యలపై భారీ వివాదం నెలకొంది.గిర్ధారి లాల్ సాహు, అల్మోరా జిల్లాలో
ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహు చేసిన వ్యాఖ్యలపై భారీ వివాదం నెలకొంది.గిర్ధారి లాల్ సాహు, అల్మోరా జిల్లాలోని సోమేశ్వర్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అవివాహిత యువకులను ఉద్దేశించి “పెద్ద వయసులో పెళ్లి చేసుకుంటారా? పెళ్ళి కాకపోతే బీహార్ నుంచి అమ్మాయిని తెస్తాం… అక్కడ 20-25 వేల రూపాయలకే అమ్మాయిలు దొరుకుతారు. నాతో రండి, మీ పెళ్లి చేస్తాం” అని అన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వ్యాఖ్యలు మహిళలను వస్తువులాగా చూసే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని, బీహార్ మహిళలను అవమానించేవిగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. బీహార్ స్టేట్ విమెన్ కమిషన్ స్వయంగా కేసు తీసుకుని సాహుకు నోటీసు జారీ చేసింది. ఉత్తరాఖండ్ కాంగ్రెస్, బీహార్‌లోని ఆర్‌జేడీ, జేడీ(యూ) నేతలు తీవ్రంగా ఖండించారు.
వివాదం రాజుకోగానే గిర్ధారి లాల్ సాహు ఒక వీడియో విడుదల చేసి, తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని, స్నేహితుడి పెళ్లి గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఎవరైనా బాధపడితే క్షమాపణలు అడుగుతున్నానని అన్నారు.ఉత్తరాఖండ్ బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ మన్వీర్ సింగ్ చౌహాన్, సాహుకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, మహిళల పట్ల అగౌరవ వ్యాఖ్యలను పార్టీ ఖండిస్తుందని చెప్పారు.

