•వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం •372 మంది కబ్జాదారులను గుర్తించిన అధికార యంత్రాంగం కోదాడ,/నినాదం : నిజం క
•వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం
•372 మంది కబ్జాదారులను గుర్తించిన అధికార యంత్రాంగం
కోదాడ,/నినాదం :
నిజం కాలానికి ముందు నుంచి కోదాడ కలపతెరువుగా సాగు తాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది… వందలాది మంది మత్స్య కార్మిక కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న చెరువు క్రమంగా కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అధికారుల వృధా శీనన్నత కోట్ల విలువైన చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతున్నాయి ప్రతి ఏటా చెరువు ఆక్రమణకు గురవుతున్న అధికారులు పట్టించుకోకుండా తమకు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు…. దీనిపై సామాజిక కార్యకర్తలు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా, మీడియా అనేక కథనాలు వేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కోర్టు తీర్పుతో అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు..
ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్….
కోదాడ పెద్దచెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి సీరియస్ అయ్యింది. పెద్దచెరువు ఆక్రమణలపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్త లపై సుమోటోగా కేసు నెం: (125/2023) కేసు నమోదు చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,చెన్నై (సౌత్ జోన్) ఆక్రమణదారులకు తాజాగా నోటీసులు జారీచేసింది. వీరంతా నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొంది. గతేడాది దీనిపై రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుద లశాఖ అధికారులతో సంయుక్త సర్వే చేయించారు. రిపోర్టు ప్రకారం చెరువులో ఉన్న శిఖం, ఎఫ్ఎఎల్, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో 372 మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి వీరంద రికి నోటీసులు జారీచేశారు. అయితే ఆక్రమించుకున్న స్థలంలో అపార్టుమెంట్లు, కల్యాణ మండపా లు, కళాశాలలు, పాఠశాలలు, క్లబ్లు నిర్మించారు.
అసలు విషయం ఏమిటంటే…
కోదాడ పెద్దచెరువు మొత్తం 727 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 413.27 ఎకరాలు శిఖం భూమిగా, 107.37 ఎకరాలు ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్ 49.04 ఎకరాలు, ఇనాం భూములు 34.32 ఎకరాలు, పట్టా భూములు 121.36 ఎకరాలున్నాయి. దీని కింద 938 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కోదాడ, అనంతగిరి, ఖానాపురం రెవెన్యూ పరిధిలో ఉంది. ఈ చెరువు కోదాడ పట్టణానికి ఆనుకుని ఉండడంతో ఆక్రమ ణలు జోరుగా సాగాయి. ప్రస్తుతం ఈ చెరువులో 200 ఎకరాలకుపైగా ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణలపై అనేక సంవత్స రాలుగా పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆక్రమణదారులను గుర్తించాల్సిందిగా ఆదేశించింది.

