HomeEditor's ChoiceGeneral

‘అన్నంలో విషం పెట్టి పిల్లలందరినీ చంపేయండి’ హాస్టల్ వార్డెన్ ఆడియో వైరల్

‘అన్నంలో విషం పెట్టి పిల్లలందరినీ చంపేయండి’ హాస్టల్ వార్డెన్ ఆడియో వైరల్

అన్నంలో విషం పెట్టి హాస్టల్ పిల్లలందరినీ చంపేయమని ఓ హాస్టల్ వార్దేన్ తన సిబ్బందిని ఆదేశించిన ఆడియో వైరల్ అయ్యింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో

కష్ట‌పడ్డా, సిన్మాలుదీసిన…. మంత్రి మల్లారెడ్డిని అనుకరించిన హీరో నవీన్ పోలిశెట్టి
అతివేగమా..!? నిర్లక్ష్యమా..!?
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్: జనవరి 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

అన్నంలో విషం పెట్టి హాస్టల్ పిల్లలందరినీ చంపేయమని ఓ హాస్టల్ వార్దేన్ తన సిబ్బందిని ఆదేశించిన ఆడియో వైరల్ అయ్యింది.

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ పిల్లలపై దుర్మార్గాలు,మద్యం మత్తులో వచ్చి బూతులు తిట్టడం , హాస్టల్ నిర్వహణ సరిగా లేకపోవడంపై విసిగిపోయిన విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేశారు. దీనిపై ఆగ్రహానికి గురైన వార్డెన్ కిషన్ నాయక్ ఫుల్లుగా మందు తాగి హాస్ట‌ల్ కు వచ్చి పిల్లలపై విరుచుకపడ్డాడు. హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి “అన్నంలో విషం కలిపి అందరినీ చంపేయండి” అని ఆదేశించాడు. ఆయన ఫోన్ లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ నయ్యింది.

దీంతో వార్డెన్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తక్షణమే స్పందించి, వార్డెన్ కిషన్ నాయక్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.ఈ ఘటన గురుకుల హాస్టళ్ల నిర్వహణలోని లోపాలను బయటపెట్టిందని, పేద విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిందని విమర్శకులు అంటున్నారు. ఆడియో వైరల్ కాకపోతే మరింత ప్రమాదకరమైన పరిణామాలు జరిగేవని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.