HomeEditor's ChoiceGeneral

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు: పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు: పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి దొంగతనం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు, టీటీ

నేటి నుండి చంద్రబాబు ‘పోరుబాట’
అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌
అది పితృస్వామ్య అహంకారామే -అనసూయ కామెంట్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి దొంగతనం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు సీఐడీ, ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది.

కేసు నేపథ్యం:
2023 ఏప్రిల్ 29న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోని పరకామణి (హుండీలో డబ్బు లెక్కించే హాల్)లో టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్ $900 (సుమారు రూ.72,000) దొంగిలించాడు. అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్ఓ) వై సతీష్ కుమార్ అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఫిర్యాదు చేశాడు. తిరుమల పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 379 (దొంగతనం), 381 (పబ్లిక్ సర్వెంట్ ద్వారా దొంగతనం) కింద కేసు నమోదైంది.

కాగా, 2023 సెప్టెంబర్ 9న తిరుపతి లోక్ అదాలత్‌లో కేసు కాంప్రమైజ్ అయింది. రవికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి మరియు చెన్నైలోని 7 ఆస్తులు (విలువ రూ.40 కోట్లు) టీటీడీకి డొనేట్ చేశాడు.

అయితే, రవికుమార్ పబ్లిక్ సర్వెంట్ కావడంతో సెక్షన్ 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్) కింద నమోదు చేయాల్సి ఉండగా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తప్పుగా రిజిస్టర్ చేశాడని కోర్టు పేర్కొంది. ఇది నాన్-కాంపౌండబుల్ ఆఫెన్స్ కావడంతో లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది.
టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఈ కాంప్రమైజ్ జరిగిందని, దేవాలయ ఆస్తి (హుండీ డబ్బు)పై బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది.