ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)కి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అర
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)కి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో బెయిల్ కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.పోలీసుల తరపు న్యాయవాది వాదనలో బెయిల్ మంజూరు చేస్తే రవి దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని, దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొని కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
గతంలో కూడా రవికి బెయిల్ నిరాకరించి పలుమార్లు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ తాజా తీర్పు మరో షాక్‌గా మారింది. పైరసీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ఆరోపణలపై రవి ప్రస్తుతం జైలులోనే కొనసాగుతాడు.

