HomeEditor's ChoiceTelangana

ప్రభాస్, చిరంజీవి,వెంకటేష్ లకు హైకోర్టులో ఊరట‌

ప్రభాస్, చిరంజీవి,వెంకటేష్ లకు హైకోర్టులో ఊరట‌

ఈ సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్న రెండు భారీ చిత్రాలు – రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ , మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటించిన

నటుడు శివాజీ హీరోయిన్లపై పురుషాహంకార ‘XXX’ వ్యాఖ్యలు…. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్న మహిళలు
హీరోయిన్ కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు…ఈ వార్తలో నిజానిజాలేంటి ?
అత్యాచారాలు డ్రెస్‌ల వల్ల కాదు మగవాళ్ల క్రూరత్వం వల్ల జరుగుతాయి -శివాజీకి నాగబాబు కౌంటర్

ఈ సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్న రెండు భారీ చిత్రాలు – రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ , మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ – టికెట్ ధరల పెంపు, అదనపు షోలు, ప్రీమియర్ షోల అనుమతి విషయంలో తెలంగాణ హైకోర్టు నుంచి కీలక ఊరట లభించింది.గతంలో డిసెంబర్ 9, 2025న సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో టికెట్ ధరల పెంపును నిషేధించడం, అదనపు షోలకు అనుమతి నిరాకరించడంతో ఈ చిత్రాల నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.

ఈ రోజు జరిగిన విచారణలో డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.సింగిల్ జడ్జి ఉత్తర్వులు ప్రస్తుత విడుదలైన ‘రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు వర్తించవని ఈ రెండు సినిమాలకు టికెట్ ధరల పెంపు, అదనపు షోలు, ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నిర్మాతలు ఇప్పటికే హోం శాఖకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, ఆ విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.

ఈ తీర్పుతో రెండు చిత్రాల నిర్మాతలకు భారీ ఊరట లభించింది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలు సాధారణ టికెట్ రేట్లతో వసూళ్లు సాధించడం కష్టమని నిర్మాతల వాదన. సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు టికెట్ పెంపు, ప్రీమియర్ షోలు (జనవరి 8 నుంచి) కీలకమని వారు పిటిషన్లలో పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ‘రాజాసాబ్’ ప్రీమియర్ షోలకు రూ.943 వరకు ధరలు ప్రతిపాదించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.