HomeEditor's ChoiceGeneral

కుక్కల బెడద నివారణకు గ్రామ సర్పంచ్ చర్యలు

కుక్కల బెడద నివారణకు గ్రామ సర్పంచ్ చర్యలు

*నినాదం కథానికి స్పందన.. కోదాడ,నినాదం:కుక్కలను చంపకుండా వాటిని నివారించేందుకుఅనంతగిరి మండలం ఖానాపురం గ్రామ సర్పంచ్ కంటూ లాజర్, ఉపసర్పంచ్ గింజుపల్ల

బొజ్జగూడెం తండా గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు – ఎస్పీ నర్సింహన్
అనంతగిరి మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

*నినాదం కథానికి స్పందన..

కోదాడ,నినాదం:
కుక్కలను చంపకుండా వాటిని నివారించేందుకు
అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ సర్పంచ్ కంటూ లాజర్, ఉపసర్పంచ్ గింజుపల్లి జగన్ నియంత్రణ చర్యలు చేపట్టారు.. కుక్కలను పట్టే స్పెషలిస్టులను పిలిపించి గ్రామంలోని కుక్కలను పట్టించి జనసంచారం లేని సురక్షిత ప్రాంతంలో విడిచి పెడుతున్నారు. ఖర్చు ఎక్కువైనా కుక్కల నివారణకు చర్యలు చేపడుతున్న సర్పంచ్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. నినాదం పత్రికలో వచ్చిన డిసెంబర్ 26వ తారీఖున వచ్చిన గ్రామాలలో కుక్కల బెడద తీవ్రం అనే వార్త కథనం తమ దృష్టికి వచ్చిందని, గ్రామంలో కూడా ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని, అందుకే నియంత్రణ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ లాజరు తెలిపారు. మిగతా గ్రామాలలో కూడా నూతనంగా ఏర్పడ్డ సర్పంచులు ఇదే తరహాలో ఆలోచన చేసి కుక్కల బెడదను నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.