•మధ్యాహ్న భోజనం పథకం ఆకస్మిక తనిఖీ … •విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ లాజర్, ఉప సర్పంచ్ జగన్… కోదాడ,నినాదం:విద్యార్థులకు నాణ్యమైన భోజనం
•మధ్యాహ్న భోజనం పథకం ఆకస్మిక తనిఖీ …
•విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ లాజర్, ఉప సర్పంచ్ జగన్…
కోదాడ,నినాదం:
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అనంతగిరి మండలం ఖానాపురం సర్పంచ్ కంటూ లాజర్,ఉపసర్పంచ్ గింజుపల్లి జగన్ అన్నారు. శుక్రవారం ఖానాపురంలోని పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఏ విధంగా ఉంటుందని విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా వసతులను కల్పించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అంగన్ వాడి కేంద్రాన్ని సైతం పరిశీలించారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు క్రమశిక్షణతో విని ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. అనంతరం ఆరో వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి వాటర్ రహదారిపైకి రావడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతుండడంతో తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించారు. సమస్య ఉందని చెబితే స్పందిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ కు గ్రామస్తులు అభినందన తెలుపుతున్నారు

