HomeUncategorized

ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టికి బిట్స్ పీలాని యంగ్ ఆలుమ్ని అవార్డు – 2026

ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టికి బిట్స్ పీలాని యంగ్ ఆలుమ్ని అవార్డు – 2026

యువ వయసులోనే పాలనలో చూపిన అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన కలెక్టర్ కు గ్లోబల్ అలుమ్ని సమ్మిట్లొ అవార్డు ప్రధానం….. ఖమ్మం ప్రతినిధి, (నినాదం):ప్రపంచ ప్

రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్యం:మంత్రి తుమ్మల
వయసైపోయిందా? … 20 వేలకే బీహార్ అమ్మాయిలు – ‍మంత్రి భర్త‌ వ్యాఖ్యలు
“మీరు హైప్‌లో ఉన్నారు… మేం ప్రజల్లో హోప్ సృష్టిస్తున్నాం”

యువ వయసులోనే పాలనలో చూపిన అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన కలెక్టర్ కు గ్లోబల్ అలుమ్ని సమ్మిట్లొ అవార్డు ప్రధానం…..

ఖమ్మం ప్రతినిధి, (నినాదం):
ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ బిట్స్ పిలాని అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక యంగ్ అలుమ్ని అచీవ్‌మెంట్ అవార్డు –2026 ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.
హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన గ్లోబల్ అలుమ్ని సమ్మిట్ లో, ఈ అవార్డును రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా ప్రదానం చేశారు.
యువ వయసులోనే పరిపాలనా రంగంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రజాసేవలో నూతన ఆలోచనలతో పాలన అందిస్తున్నందుకు అనుదీప్ దురిశెట్టిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు బిట్స్ పిలాని అలుమ్ని రిలేషన్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
ప్రతీ సంవత్సరం కఠినమైన ఎంపిక ప్రక్రియలో కొద్దిమంది ప్రతిభావంతులైన అలుమ్నీలకే ఈ అవార్డును ప్రదానం చేసే బిట్స్ పిలాని, విద్యాభ్యాసం పూర్తయ్యాక తక్కువ కాలంలో విశేష విజయాలు సాధించిన వారిని గుర్తించడమే లక్ష్యం అని పేర్కొంది.
ఈ అవార్డుతో ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు అని పలువురు అభినందనలు తెలిపారు.