ఆరోగ్యవంతమైన పర్యటనలకు కేంద్ర బిందువుగా ములుగు. జిల్లా మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ప్లాస్టిక్ రహిత మేడారం వనదేవతల జాతరగా
- ఆరోగ్యవంతమైన పర్యటనలకు కేంద్ర బిందువుగా ములుగు. జిల్లా
- మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
- ప్లాస్టిక్ రహిత మేడారం వనదేవతల జాతరగా జరుపుకోవాలి
- రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (ములుగు)(నినాదం):
పచ్చటి అడవి అందాలతో ములుగు జిల్లా పర్యాటకులకు స్వాగతం పలుకుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం తాడ్వాయి మండలం పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్ ను ఆమె ప్రారంబించారు. పర్యాటకులు ఎక్కడికో వెళ్ళి పర్యటించి పట్టణ ప్రాంతాల్లో కలుషిత వాతావరణంలో గడిపే బదులు, ములుగు జిల్లా పచ్చని అడవి అందాల పర్యాటక ప్రదేశంలో కుటుంబ సమేతంగా సరదాగా గడుపుతూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుకుంటూ ఆరోగ్యవంతమైన పర్యటనలకు ములుగు జిల్లా కేంద్ర బిందువుగా మారిందన్నారు. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తూ చాలా ప్రాంతాల ప్రజలు వస్తు వెళుతున్నారు. గత సంవత్సరం పస్రా తాడ్వాయి మద్యలో జలగలంచ వాగు వద్ద బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ప్రారంభించామని, ఇటీవలే తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ కూడా అడవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని అదే విధంగా ఈ రోజు జలగలంచ వద్ద అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు దీటుగా మన అడవి అందాలు ఉంటాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వారు, సరదా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడపడానికి ములుగు జిల్లా ప్రకృతి అందాల తరపున రాష్ట్ర మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, డి ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అడవి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి….మంత్రి సీతక్క
వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ఎస్.ఎస్ తాడ్వాయి మండలం మేడారం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి ఆమె దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులను, ఫ్లోరింగ్ పనులను, క్యూ లైన్ షేడ్స్ నిర్మాణాలను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. సెలవు దినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభం చేయడం జరుగుతుందని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. గద్దెల ప్రాంగణం విద్యుత్ కాంతుల వెలుగులతో ఆకర్షవంతగా కనిపించడం కోసం నూతన ఆధునిక విద్యుత్ దీపాలను అమర్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆలయ పూజారులు, గుత్తేదారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత మేడారం వనదేవత జాతర జరుపుకోవాలే… మంత్రి సీతక్క
ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం జాతర అటవీ ప్రాంతంలో ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా “ప్లాస్టిక్ ను వాడకండి. పర్యావరణాన్ని పరిరక్షించండి” అనే గోడపత్రికలను జాతరకు వచ్చే భక్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకండి అనే కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర కు వచ్చే భక్తులు అటవీ ప్రాంతం లో పర్యావరణాన్ని కాపాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాస్, కవర్ల ను ఉపయోగించవద్దని అన్నారు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్ కవర్లలో వేడి, వేడి ఆహారం తీసుకోవద్దన్నారు. దానివల్ల జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతరలో భక్తులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా గాలి, భూమి నీరు ను రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ , ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, సభ్యులు రాముసేవక్, రవికాంత్,అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

